సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వాటిని వినియోగిస్తూ, చిన్నారులకు కూడా అలవాటు చేస్తున్నారు. టీచర్లే టిక్‌టాక్‌కు బానిసల్లా వీడియోలు తీసుకుంటున్నారు. అంతేకాదు, బడిలోని– అమ్మాయిలతో కలిసి టిక్‌టాక్ వీడియోలు తీస్తూ అలజడి రేపారు. కొత్తగూడెం, రామవరం ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. టీచర్లు, విద్యార్థినుల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లపై మండిపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
Tags girls khammam School Teachers tiktok videos viral