ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తేడా ఏంటో ఇవాళ ఏపీ ప్రజలకు కళ్లారా తెలిసివచ్చింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు…నాటి ప్రతిపక్ష నాయకుడిగా వైయస్ జగన్ దాదాపు ఏడాదిన్నరపాటు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఎన్నో సందర్భాల్లో జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న జగన్ జనం మధ్యలో చిక్కుకుపోయిన ఓ ఆటోను చూశారు. ఆ ఆటోలో ఓ గర్భిణి స్త్రీ పురిటినొప్పులతో బాధపడుతుండడం గమనించిన జగన్ మానవత్వంతో స్పందించారు. వెంటనే తన ప్రసంగం ఆపేసి అన్నా అన్నా….. ఆ ఆటోకు కొంచెం దారి ఇవ్వండన్నా అంటూ మైక్‌లో కోరారు. జగన్ కోరిక మేరకు వెంటనే ప్రజలు పక్కకు జరిగి ఆ ఆటోకు దారి ఇచ్చారు. ఆ ఆటో జనం మధ్యలోంచి బయటకు వెళ్లి దగ్గర్లోనే ఉన్న అంబులెన్స్‌కు చేరేవరకు .జగన్ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ సీన్ జగన్‌లోని మానవత్వానికి, నిదర్శనంగా నిలిచింది.
అయితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేత చంద్రబాబులో నిలువెల్లా అధికార కాంక్ష, స్వార్థం, రాజకీయ స్వప్రయోజనాలే తప్పా.. మానవతా విలువలు శూన్యమని తాజాగా జరిగిన ఘటన నిరూపించింది. ఫిబ్రవరి 19, 2020న ప్రకాశం జిల్లా మార్టూర్ మెయిన్ రోడ్డుపై ప్రజాచైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబు ట్రాఫిక్ ఆపేసి మరీ సభ నిర్వహిస్తుండగా అక్కడికి 108 అంబులెన్స్ వచ్చింది. ప్రమాదంలో గాయపడ్డ ఓ గ్రానైట్ కార్మికుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అంబులెన్స్ సైరన్ విని కూడా చంద్రబాబు స్పందించలేదు. ఎన్నిసార్లు హారన్ కొట్టినా దారి ఇవ్వలేదు. దీంతో 108 అంబులెన్స్ తిరిగి వేరే రూట్లో వెళ్లిపోయింది. కనీసం చావు బతుకుల్లో ఉన్న బాధితుడి పట్ల చంద్రబాబు కానీ, ఆ పార్టీ నేతలు కానీ కనీస మానవత్వం చూపలేదు. దీంతో చంద్రబాబు తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇదేనా 40 ఏళ్ల అనుభవం అంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు ఘటనలను పోలుస్తూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూశారుగా.. మానవత్వంతో స్పందించిన జగన్ ఎక్కడా…రాజకీయం కోసం సాటిమనిషి చావుబతుకుల్లో ఉన్నా పట్టించుకోని చంద్రబాబు ఎక్కడా..అని ప్రజలు అంటున్నారు. చంద్రబాబుకుకనీస మానవత్వం లేదని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.