ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజా ఐటీ రైడ్ల గురించి కిమ్మనడం లేదు. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి బంధువు IT రైడ్స్ లో పట్టుబడినపుడు.. చంద్రబాబుకు సంబంధం లేకపోయినా కానీ ప్రెస్ మీట్ పెట్టి గంట మాట్లాడారు.. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి బంధువులు కనిమొళి, రాజా IT రైడ్స్ లో పట్టుబడినపుడు కూడా చంద్రబాబుకు సంబంధం లేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి దేశం ఏమి అవుతుంది అంటూ పావు గంట తన వెర్షన్ చెప్పాడు.. అలాగే తెలంగాణాలో ఓ మంత్రి దగ్గర పనిచేసే వ్యక్తి IT రైడ్స్ లో పట్టుబడినపుడు చంద్రబాబుకు సంబంధం లేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి నేను కట్టిన హైదరాబాద్ పాడుచేస్తున్నారు అంటూ అరగంట స్పీచ్ ఇచ్చారు. నేను నిప్పు.. నేను అగ్గి.. నేను సత్య హరిచంద్రుడ్ని అని మీడియా ముందు చిందు మాట్లాడే చంద్రబాబు తాజా గా IT రైడ్స్ లో ఆయన సొంత PA దగ్గర వేల కోట్లు దొరుకుతే ఉలుకు లేదు పలుకు లేదు కనీసం ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడకపోవడం పట్ల మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి.
