మంత్రి, స్పీకర్, ఎమ్మెల్సీ ఇలా ఎన్నో పదవుల్లో నాటుకుపోయిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. ఇన్ని పదవుల్లో ఆయన ఉన్నారు అంటే ఆయనకు రాష్ట్రంలో ఎంత పేరు, పలుకుబడి ఉంటుందో అర్ధంచేసుకోవచ్చు. కాని ఈయన అలా కాదు..తన సొంత నియోజకవర్గం సొంత నివాసం తుని లోనే యనమలను ఎవరూ పట్టించుకోరట. ఆయన పదవిని అడ్డం పెట్టుకొని తమ్ముడు కృష్ణుడు ఎన్నో అరాచకాలు, అన్యాయాలు చేసాడు. ఇసుకు విషయంలో కూడా ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. దాంతో విసిగిపోయిన ప్రజలు 2014 ఎన్నికల్లోనే బుద్ధి చెప్పారు. కాని అధికారం ఉండడంతో ఎమ్మెల్సీ కట్టబెట్టి గద్దె ఎక్కించారు చంద్రబాబు. ఇక జరిగిన ఎన్నికల్లో కూడా దారుణంగా ఓటమని చవిచూశారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “కాలం చెల్లిన యనమల ఎత్తుగడలను గుడ్డిగా నమ్మిన బాబు కౌన్సిల్ నే బలి పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట. రద్దు అనేది లాంఛనమే అని వాళ్లకి అర్థమైంది. కౌన్సిల్ పోతే మిగిలిన పదవీ కాలం జీతభత్యాలు చెల్లిస్తానన్న హామీని బాబు నిలబెట్టుకోవాలని డిమాండు చేస్తున్నారట” అని అన్నారు.