టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈమేరకు మొన్ననే నిశ్చితార్ధం కూడా జరిగింది. వీరిద్దరూ గత 8సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్ళిచేసుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కనపెడితే నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. ఈ చిత్రం 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 17న ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఇందులో భాగంగా మాట్లాడిన నితిన్ నాకు ఇష్టమైన వారు నా వాళ్ళు అనుకునే వారు అమ్మ, నాన్న, అక్క, పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ అని చెబుతాడు. ఆ తరువాత కొద్దిసేపటికి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి తను నా ఆరో ప్రాణం అని అంటాడు. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని నెటీజన్లు నితిన్ ని సరదాగా ఆటపట్టిస్తున్నారు. నేకు పెళ్లి అయ్యాక మీ భార్య చేతుల్లో దంచుడే అని అంటున్నారు.