తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ,ప్రముఖ బెంగాలీ నటుడుతపస్పాల్( 61) ఈ రోజు మంగళ వారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయన తన కుమార్తెని చూసేందుకు ఇటీవల ముంబై వెళ్లారు. అక్కడ నుండి కోల్కత్తాకి విమానంలో తిరిగి వస్తున్న క్రమంలో ఛాతిలో నొప్పి వస్తుందని సిబ్బందికి తెలిపాడు.
దీంతో వెంటనే వారు అతనిని జుహూలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయనకి భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని చందన్ నగర్లో జన్మించిన తపస్పాల్ 1980లో దర్శకుడు తరుణ్ మజుందార్ దర్శకత్వంలో తెరకెక్కిన దాదర్ కీర్తి సినిమాతో బెంగాలీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు.
ఆ తర్వాత పలు హిట్ చిత్రాలు చేశారు. తృణముల్ కాంగ్రెస్లో ఎంపీగా గెలిచి రాజకీయాలలోను తన సేవలందించారు. ఆయన మృతికి బెంగాలీ సినీ పరిశ్రమ సంతాపం తెలియజేసింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని వారు ప్రార్ధించారు.