భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మంగళవారం అంటే ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం భేటీ అవ్వనుంది. ఏపీలో శాసనమండలి రద్దు నిర్ణయం అప్రజాస్వామికమని, రద్దుకు ఆమోదించవద్దని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు వెంకయ్య నాయుడికి కోరనున్నారు. అలాగే మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా కేంద్రం అడ్డుకోవాలని, అమరావతి రైతులకు న్యాయం చేయాలని వారు కోరనున్నారు. ఈభేటీ నిమిత్తం, శాసనమండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ లు మినహా, 10మంది ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లనున్నారు. 24న రెండో విడతగా వారితోపాటు మిగిలిన అందరూ వచ్చి ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్షా, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్లను కలవనున్నట్లు సమాచారం.
