పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఇక నుండి నేను ప్రజలకే అంకితం సినిమాలుజోలికి పోను రానున్న 25ఏళ్ల వరకు ప్రజాసేవ చేస్తాను అని చెప్పారు. కాని ఇప్పుడు వరుసగా మూడు సినిమాలకు సైన్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇక సినిమాలు విషయం గురించి ఆయన మాటల్లోనే చూసుకుంటే నాకు ఇండస్ట్రీస్ గాని ఫైనాన్సియల్ గా గాని ఎటువంటే ఆదాయం లేదని చెప్పారు. నేను ఇప్పుడు సినిమాలు చేయడానికి కారణం నా పిల్లలే అని అన్నారు. నా పిల్లలను చదివించుకోదానికి మరియు పార్టీ కోసం నేను సినిమాలు చెయ్యాలి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు.