తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆరేళ్లల్లో లక్ష యాబై వేల కోట్లు ఇచ్చింది తెలంగాణ బీజేపీకి చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర బీజేపీ నేతలతో పాటుగా సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అసత్యాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరేళ్లుగా కేంద్ర్తానికి పన్ను ఆదాయంగా మొత్తం 2.70లక్షల కోట్లు చెల్లించాము.
కానీ ఇందులో కేంద్ర్తం తెలంగాణకు ఇచ్చింది కేవలం 1.15లక్షల కోట్లు మాత్రమే అని అన్నారు.మరి మిగతా రూ.1.60లక్షల కోట్లు ఏమయ్యాయి?’’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల ఆర్థిక అవసరాలను తీర్చే బాధ్యతను కేంద్రం సమదృష్టితో నిర్వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.