వచ్చే నెల నవంబర్ తొమ్మిదో తారీఖున హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .మరో కొద్ది రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గెలిచి అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుంది .
అందులో భాగంగా అధికారంలోకి వస్తే తమ పార్టీ తరపున పాలన కొనసాగించే సీఎం అభ్యర్థిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రేమ్ కుమార్ ధుమల్‌ను ఆ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా ఈ రోజు మంగళవారం ప్రకటించింది.
సీనియర్ నేత ధుమల్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినట్టు బీజేపీ చీఫ్ అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రేమ్ కుమార్ ధుమల్ నేతృత్వంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోరాడుతుందని ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు.