తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెల్సిందే .రేవంత్ రెడ్డి చేరి పట్టుమని పది గంటలు కూడా గడవకముందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,సీఎల్పీ నేత జానారెడ్డి ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సెటైర్లు వేశారు .
ఈ రోజు అసెంబ్లీ సమావేశాలనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీ తరపున అద్వానీలాంటివాడినని ..నేను ఎవర్ని ముఖ్యమంత్రి పదవి అడగబోను అన్నారు .ఒకవేళ పార్టీలో అందరు కోరితే తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి ఎల్లప్పుడు సిద్ధం అని ఆయన తన మనస్సులో మాటను బయటపెట్టారు .
ఈ సందర్భంగా రేవంత్ గురించి మాట్లాడుతూ “రానున్న ఎన్నికల్లో తమ పార్టీను ఎవరు గెలిపిస్తే వారే బాహుబలి అని అన్నారు .అంతే కానీ పార్టీలో చేరగానే బాహుబలి కారు అని పరోక్షంగా రేవంత్ ను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు .