తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు. విశ్రాంత ఇంజినీర్ల అసోసియేషన్ (ట్రీ) ప్రతినిధులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి తమ 2019-20వ సంవత్సర నివేదిక పుస్తకాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటిప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల ద్వారా అందుతున్న ఫలాలను ఆమెకు వివరించినట్టు ట్రీ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
చిరుధాన్యాలకు సంబంధించిన పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా ట్రీ సభ్యులు గవర్నర్‌కు అందించారు. తాను చిరుధాన్యాలను మాత్రమే తీసుకుంటున్నానని.. వాటిపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారని మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు చిరుధాన్యాలు అందిస్తే బాగుంటుందని గవర్నర్ అభిప్రాయపడినట్టు ట్రీ ప్రతినిధులు తెలిపారు. గవర్నర్‌ను కలిసినవారిలో ట్రీ అధ్యక్షుడు చంద్రమౌళి, కెప్టెన్ జనార్దన్, మహాత్మారెడ్డి, రాంరెడ్డి, ముత్యంరెడ్డి, ప్రొఫెసర్ బానోతు రమణనాయక్, మదన్‌మోహన్ ఉన్నారు.