ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ప్రారంభమైంది.. తొలివిడత లెక్కింపులోనే ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉందని వార్తలు వెలువడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. అయితే 2015తో పోల్చితే మాత్రం అప్పటికంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలు బీజేపీ గెల్చుకుంది. అలాగే మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో 65 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో బీజేపీకి భారీగా ఓట్లు పడ్డాయి. కానీ.. అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీ బోల్తాకొట్టింది.
19 స్థానాల్లో మాత్రం బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. ఆప్ అభ్యర్ధులపై కేజ్రీవాల్ పెట్టుకున్న నమ్మకానికి వారు కూడా ఈ ఎన్నికల్లో కష్టించి పనిచేసారు. దీనితో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు..ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలనుద్దేశించి ఒక ప్రకటన వెలువరించారు. సంబరాలు చేసుకునే సమయంలో బాణాసంచా మాత్రం కాల్చవద్దని ఆయన వారిని కోరారు. ఢిల్లిలో కాలుష్యాన్ని నివారించడం కోసం బాణాసంచా కాల్చవద్దని ఆయన కోరారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాడో లేదో అప్పుడే ప్రజలగురించి ఆలోచించాడు ఈయన అందుకే అత్యంత శక్తివంతమైన బీజేపీని కూడా ఓడించగలిగాడు అంటూ అంటూ కేజ్రీవాల్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.