జబర్దస్త్ షోలో హైపర్ ఆది, యాంకర్ అనసూయ అంటే ఏలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఆది స్కిట్ లో ముందుగా సాంగ్ వస్తే ఒకప్పుడు అనసూయతో మొదలు పెట్టేవాడు. అలా వారి పైర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక తాజాగా ఇప్పుడు అనసూయను పక్కనపెట్టి ప్రతీసారి కొత్తవారిని ఎంటర్ చేస్తున్నాడు. అంతేకాకుండా అతను ఎంచుకున్న ఎంట్రీ సాంగ్ కి వారి డాన్స్ చూస్తే ఎవరికైనా ఊపు వస్తుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో ఆది ఒకరిని ఎంట్రీ సాంగ్ లో దింపుతాడు. అది చూసిన అనసూయ అసుయతో ఇంక చాల్లే ఆపు అని అంటుంది. వెంటనే రోజా ఎక్కడో కాలుతుంది అని సెటైర్ వేస్తుంది. దాంతో వారిద్దర మద్య ఎలాంటి రిలేషన్ ఉందో అన్నట్టు అందరూ అనుకుంటున్నారు.
