క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్ని విజయాలు, అపజయాలు అనేది పక్కన పెడితే జట్టు యొక్క ప్రవర్తన విషయానికి వస్తే ఎప్పటికీ న్యూజిలాండే ముందు వరుసలో ఉంటుంది అని చెప్పాలి. మొత్తం అన్ని జట్లలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కొంచెం వ్యతిరేకంగా ఉంటాయని చెప్పాలి. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ అయితే మరింత పెరిగిపోయిందని చెప్పాలి. దానికి ముఖ్య ఉదాహరణ ఆదివారం జరిగిన అండర్ 19 ఫైనల్ అని చెప్పాలి. ఇక అన్ని జట్ల విషయానికి వస్తే ఒక్క న్యూజిలాండ్ మాత్రం ఎలాంటి సందర్భాల్లోనైన సానుకూలంగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు. ఆ తరువాత స్థానంలో ఇండియా ఉంటుంది.