జనసేన గ్లాస్ పగిలిపోయిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆ పార్టీ గుర్తులాంటివాడేనని ఆయన అన్నారు. అందరికీ ఉండాల్సిన రాజకీయ స్థిరత్వం, సిద్ధాంతం, వ్యక్తిత్వం పవన్ కల్యాణ్‌కు లేవన్నారు. ఒక్క విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ చెప్పింది చేస్తున్నాడని అన్నారు. ఆంద్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పరిపాలన బాగుంటే సినిమాలు తీసుకుంటానని ఓ బహిరంగ సభలో చెప్పిన మాటను నిజం చేస్తున్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ పరిపాలన బాగుండడం కారణంగానే పవన్ కల్యాణ్ గడ్డాలు తీసేసి సినిమాలకు సిద్ధమయ్యాడని వైసీపీ ఎమ్మెల్యే అమరనాద్ అన్నారు.
