తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. రైతు బంధు నిధులను విడుదల చేసింది. రైతు బంధు ద్వారా 42.42 లక్షల మంది రైతులు లబ్ది పొందతనున్నారు. ఇప్పటికే 35.92 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులను జమ చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రైతుల పెట్టుబడి మొత్తం వారి వారి ఖాతాల్లో వచ్చే విధ:గా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఐదు విడుతల్లో సుమారు 35.91 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 3, 060.03 కోట్ల మొత్తం జమ చేసినట్లు అంచనా. త్వరలోనే ఆరు, ఏడో విడతల్లో మిగిలిన రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడిస్తోంది.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ రైతు బంధు పథకం రైతులకు ఎంతో మేలు చేకూరిస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ఎకరాకు రూ. 10 వేలను పంపిణీ చేస్తోంది. మూడు సంవత్సరాలుగా రైతులకు రెండు సీజన్‌లకు గాను ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తూ వస్తోంది. ఈ సాయంతో పంటలకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, ఇతరత్రా వాటిని రైతులు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల దళారుల సమస్య తప్పిందంటున్నారు రైతులు.