Home / ANDHRAPRADESH / చంద్రబాబుపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!

చంద్రబాబుపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!

కేంద్రలో మోదీ సర్కార్ తీసుకువచ్చిన ఎన్నార్సీ,. సీఏఏ., ఎన్‌పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లింములు, వివిధ సామాజిక సంస్థలు, వివిధ జాతీయ. ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేసీఆర్, జగన్‌మోహన్ రెడ్డి ఎన్నార్సీని ఒప్పుకునేది లేదని ప్రకటించారు. అయితే ఎన్నార్సీ, సీఏఏలను పైకి వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు ఈ విషయంపై పెద్దగా మాట్లాడడం లేదు. రీసెంట్‌గా పార్లమెంట్‌లో ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు మాట్లాడగా…టీడీపీ ఎంపీలు ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఢిల్లీలో మోదీ సర్కార్‌కు దగ్గరయ్యేందుకే టీడీపీ ఎన్నార్సీ విషయంలో ద్వంద వైఖరిని అవలంబిస్తోంది. పైకి మద్దతు లేదంటూనే లోపాయికారీగా మోదీ సర్కార్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఇదే విషయంపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పందించారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ…ముస్లింలకు అన్యాయం జరిగితే మౌనంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సీని రాష్ట్రంలోకి రానిచ్చే ప్రసక్తే లేదని సీఎం వైఎస్‌ జగన్‌ సృష్టం గా చెప్పారని తెలిపారు. ఎన్నార్సీ వంటి సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం మంచిది కాదని మంత్రి అనిల్‌ టీడీపీ నేతలకు హితవు పలికారు. పార్లమెంటులో తమ ఎంపీ మిథున్‌ రెడ్డి ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ మాట్లాడారని.. టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై మంత్రి అనిల్ విరుచుకుపడ్డారు. అమరావతి అంటూ.. చంద్రబాబుకు జోలె పట్టుకుని బిక్షాటన చేయడం మాత్రమే తెలుసునని.. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏపై మాట్లాడే దమ్ము లేదని తీవ్ర వ్యాఖ‌్యలు చేశారు.

కేవలం 29 గ్రామాల కోసం బినామీ, బంధువుల ఆస్తులు పోతాయనే భయంతో చంద్రబాబు జోలె పట్టుకుని తిరుగుతున్నారని మంత్రి అనిల్ సెటైర్ వేశారు. ఇక 151 అసెంబ్లీ సీట్లు సాధించి.. దేశంలోనే చరిత్ర సృష్టించిన వైఎస్సార్‌సీపీ లాంటి పార్టీని గాలిలో కలుపుతామంటారా అంటూ  బాబుపై నిప్పులు చెరిగారు. సీఎం వైఎస్‌ జగన్‌ 10 సంవత్సరాల తన రెక్కల కష్టంతో.. 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొంది సంచలన విజయం సాధించారని మంత్రి అన్నారు. కాని సొంత మామకే వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్న చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ పెట్టిన తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి.. దమ్ముంటే సొంతగా పార్టీ పెట్టి గెలవాలని చంద్రబాబుకు   అనిల్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. కేవలం ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీపై మమకారంతో ఇప్పటికీ టీడీపీకి ఓట్లు వస్తున్నాయి తప్ప.. చంద్రబాబు ముఖం చూసి కాదని ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ బొమ్మ లేకుంటే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మూడో నేత్రం తెరిస్తే చంద్రబాబు భస్మం అవుతాడని.. కానీ ఆయనలో క్షమా,దయా గుణం ఉండటంతో టీడీపీ ఎన్ని కుట్రలు చేస్తున్నా ఇంకా సహిస్తున్నారని మంత్రి అనిల్‌ తెలిపారు.  మొత్తంగా చంద్రబాబుపై మంత్రి అనిల్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat