Home / NATIONAL / బెంగళూరు-బీదర్‌ బెంగళూరు మధ్య కొత్త విమాన సర్వీసు..!

బెంగళూరు-బీదర్‌ బెంగళూరు మధ్య కొత్త విమాన సర్వీసు..!

ఉడాన్‌పథకంలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలందిస్తున్న ట్రూజెట్‌ నెట్‌వర్క్‌పరిధిలోకి ఉత్తర కర్ణాటకలోని బీదర్‌తాజాగా చేరింది. కొత్తగా ప్రారంభించిన బీదర్‌ఎయిర్‌పోర్టు నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు విమాన సర్వీసు అందించిన తొలి సంస్థగా ట్రూజెట్‌నిలిచింది.

రాజధాని బెంగళూరుకు విమాన సర్వీసులు నడపాలని బీదర్‌వాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. రోడ్డు మార్గంలో బీదర్‌నుంచి బెంగళూరుకు దాదాపు 12 గంటలు పడుతుంది. కొత్తగా ప్రారంభించిన ట్రూజెట్‌విమాన సర్వీస్ ద్వారా గంట 40 నిమిషాల్లో ఈ ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. విమానాల్లో బెంగళూరు వెళ్లాలనుకునే బీదర్‌వాసులు చాలా మంది హైదరాబాద్‌వచ్చి అక్కడి నుంచి బెంగళూరుకు చేరుకుంటారు.

బెంగళూరు-బీదర్‌బెంగళూరు విమాన సర్వీసును కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడ్యూరప్ప బెంగళూరు ఎయిర్‌పోర్టులో ప్రారంభించి, ట్రూజెట్‌ విమానంలో బీదర్‌వరకు ప్రయాణించారు. ఈ సేవలు ఇక నుంచి వారంలో ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి.

బెంగళూరులో ట్రూజెట్‌ సర్వీసు ప్రారంభించిన అనంతరం అదే విమానంలో బీదర్‌ వరకు ప్రయాణించారు. సీఎం యడ్యూరప్పతో పాటు మంత్రులు, బీదర్‌ ప్రజాప్రతినిధులు ప్రయాణం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడుతూ బెంగళూరు విమానాశ్రయం నుంచి బీదర్‌కు కేవలం గంటా 40 నిమిషాల్లోనే చేరుకున్నామని, సాధారణంగా బెంగళూరు నుంచి బస్సులో బీదర్‌కు చేరుకోవాలంటే 12 గంటల ప్రయాణం అవుతుందని ట్రూజెట్‌ విమాన సర్వీసుల వల్ల ప్రయాణ దూరం భారం తగ్గిందని విమానసర్వీసుల పట్ల సీఎం యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. బీదర్ పరిధిలో ఉన్న “కళ్యాణ కర్నాటక” అభివృద్ధికి ట్రూజెట్‌ విమాన సర్వీసులు మరింత దోహదపడతాయని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆకాంక్షించారు.

సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రథమ శ్రేణి నగరాల నుంచి ఇతర నగరాలకు విస్తరించాలనే ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ఉడాన్‌పథకం ద్వారా భాగస్వామిగా నిలుస్తోంది ట్రూజెట్‌. ఉడాన్ పథకంలో భాగంగా తనకు అప్పగించిన మార్గాల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విమానయాన సంస్థ ట్రూజెట్‌ ఒక్కటే.

హైదరాబాద్‌కు చెందిన టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ప్రైవేట్‌లిమిటెడ్‌కు చెందిన ట్రూజెట్‌ ఎయిర్‌వేస్‌తన మొదటి ప్రయాణాన్ని జూలై 12, 2015న ప్రారంభించింది. నాలుగున్నరేళ్ల స్వల్పకాలంలోనే తన సేవలను 24 కేంద్రాలకు విస్తరించింది. దేశంలో ఆర్థికశక్తులుగా ఎదుగుతున్న ప్రధానమైన ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ట్రూజెట్‌ తన సేవలందింస్తోంది. ప్రస్తుతం  హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై కేంద్రంగా  ఔరంగాబాద్, బెల్గాం, బెంగళూరు, బీదర్, కడప, గోవా, ఇండోర్, జైసల్మేర్, జల్గావ్, కాండ్లా, కొల్హాపూర్, ముంబయి, మైసూరు, నాందేడ్, నాసిక్, పోరుబందర్, రాజమండ్రి, సేలం, తిరుపతి, విద్యానగర్, విజయవాడ వంటి 24  ప్రాంతాలకు  విమానాలు నడుపుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat