మొత్తం నాలుగు రోజుల పాటు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజు బుధవారం మొదలైంది. మొదటి రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను జంపన్న వాగు మీదగా మేడారం గద్దెకు తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. అయితే సమ్మక్క తన భర్త పడిగిద్దరాజు మరణ వార్తను వింటుంది.
అది విన్న సమ్మక్క యుద్ధరంగంలో దూకుతుంది. వీరోచితంగా పోరాడి ఎంతో మంది కాకతీయ సైన్యాన్ని మట్టికరిపిస్తుంది. దీంతో భయపడ్ద కాకతీయులు దొంగచాటుగా సమ్మక్క సారక్కలను కత్తితో పొడుస్తారు.
సారక్క అక్కడిక్కడే మరణిస్తుంది. అయితే శత్రువుల చేతిలో దెబ్బ తిన్న సమ్మక్క ఒంటి నిండా బాణాలతో చిలుకల గుట్త వైపు వెళ్తుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు సమ్మక్కను అనుసరిస్తూ అటువైపుగా వెళ్తుంటారు. అయితే మధ్యలో ఎంత వెతికిన కానీ సమ్మక్క వారికి ఎక్కడ కూడా కన్పించదు. మధ్యలోనే మాయమై పోతుంది.