తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది.
మొదటి రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను జంపన్న వాగు మీదగా మేడారం గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు.
మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం దేవతలను వనాల్లోకి తరలిస్తారు. ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారక లాంఛనాలతో నిర్వహిస్తారు.