రేపటి నుండి సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న సంగతి విదితమే. అయితే సమ్మక్క ఎవరు.. సారలమ్మ ఎవరు..? అనే విషయం ఎవరికి తెలియదు.. అయితే సమ్మక్క ఎవరో తెలుసుకుందామా..?.
13వ శతాబ్ధంలో కోయరాజ్యం (ప్రస్తుతం మేడారం) కాకతీయ రాజ్యంలో సామంత రాజ్యంగా ఉండేది. ఆ రాజ్యాన్ని కోయలే పాలించుకుంటూ ఉండేవారు. ఒకరోజు వేటకు వెళ్ళిన కోయలకు ఓ దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
పాము పుట్టపై ఒక చిన్నారి పడుకుని ఉంటుంది. చుట్టూ కౄర మృగాలు పాపకు రక్షణగా ఉంటాయి. ఇది చూసిన కోయలు సాక్షాత్తు దైవాంశ సంభూతురాలిగా భావించి పాపను పొలవాస గూడానికి తీసుకెళ్తారు. మేడరాజు ఆ పాపను దత్తత తీసుకుని సమ్మక్క అని పేరు పెడతారు.