జనవరి 2019..కేఎల్ రాహుల్ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లో భాగంగా నోరు జారడంతో తనకి ఎంతో ఇష్టమైన క్రికెట్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. అనంతరం కొన్నాళ్ళు తరువాత మళ్ళీ మైదానంలో అడుగుపెట్టి తనదైన శైలిలో ఆటను ప్రదర్శించి చివరికి ఇప్పుడు టీ20 లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా మాన్ అఫ్ ది సిరీస్ తన సొంతం చేసుకున్నాడు. తద్వారా రాహుల్ ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి వచ్చాడు. ఇక మరో ఓపెనర్ రోహిత్ 9, కోహ్లి 10 స్థానాల్లో ఉన్నారు.
