గత ఐదేళ్ళ పాలనలో అధికార బలంతో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకూ పాల్పడింది టీడీపీ. రైతుల ఆత్మాహత్య, నిరుద్యోగులు, ముసలివారు ఇలా అందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించడం, అదేదో టీడీపీ నేతలకు, బాబు వర్గానికి అందరికి కల వచ్చినట్టు అందరూ అక్కడ భూములు కొనడం ఇవన్నీ చూస్తుంటే ఎంత పెద్ద స్కెచ్ అనేది బాగా అర్ధమయింది. ఇప్పుడు వాటిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయంలో అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు పై మండిపడ్డ వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ” జీవనోపాధి లేక వలసలు వెళ్లే ఉత్తరాంధ్ర ప్రజల మీద నిప్పులు పోసుకుంటున్నారెందుకు చంద్రబాబు? ఈనాడు, చంద్రజ్యోతిలతో జిఎన్ రావు కమిటీని వక్రీకరించే రాతలు రాయించారు. ముంబై, చెన్నైలకు కూడా తుఫాను తాకిడి ఉంది. విశాఖకు అంతే. అగ్నిపర్వతం అంచున ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారెందుకు?” అని అన్నారు.