తెలంగాణరాష్ట్ర వ్యవసాయశాఖ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఈ రోజు బుధవారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. వనపర్తిలో స్థానికంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.
155 మంది లబ్దిదారులకు మంత్రి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం వారితో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు.
అనంతరం సీఎం సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. అదేవిధంగా వనపర్తి వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.