దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు నిర్భయ దోషికి షాకిచ్చింది. తనకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ దోషి ముఖేష్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది.
విచారణకు కాదు కనీసం ఆ పిటిషన్ ను స్వీకరించడానికి కూడా అత్యున్నత న్యాయ స్థానం ఒప్పుకోలేదు. దీంతో ముఖేష్ కు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయనున్న సంగతి విదితమే.