టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మరో సంచలనానికి తెర తీసాడు. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో తెలియాలి. ఇక అసలు విషయానికి వస్తే అడవిలో జంతువులను వేటాడితే అది కేసు అవుతుంది. దీనికి హీరో సల్మాన్ ఖాన్ సైతం భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అయితే దీనిపై స్పందించిన వర్మ “ఒక అడవిలో జింకను వేటాడినందుకు సల్మాన్ ఖాన్ను పోలీసులు మరియు కోర్టులు వేటాడితే, అదే పోలీసులు మరియు న్యాయస్థానాలు తన ముందు యార్ద్ లో వేట సాధన చేస్తున్న ఈ భయంకరమైన బాస్టర్డ్ను ఏం చెయ్యాలి??? ఒకవేళ న్యాయం జరిగితే దీనికి సమాధానం చెప్పాలని పోలీసులను, కోర్టులను కోరుతున్నాను” అని పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
If Salman khan is being hunted by police and courts for hunting a deer in a forest,shouldn’t the same police and courts hunt this terrible bastard who’s practicing hunting in his own front yard ??? If at all there is justice I demand the police and courts to answer this pic.twitter.com/7taCgLx0gb
— Ram Gopal Varma (@RGVzoomin) January 28, 2020