వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. రాజధానిని ఉత్తరాంధ్ర రాయలసీమలో మరో రెండు రాజధానులు తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు వీటిని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసాడు. “ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్లు ఇన్నాళ్లు టిడిపిని ఆదరించినందుకు కోలుకోలేనంత దెబ్బకొట్టాలని చూస్తున్నావు గదా బాబూ! వెనకబడిన ఈ ప్రాంతాలు ఎప్పటికీ నీ కాలికింద చెప్పులాగే పడి ఉండాలా? నీ ధన దాహానికి వాళ్ల జీవితాలు బలికావాల్సిందేనా?” అని ప్రశ్నించారు.