భవిష్యత్తు తరాలకు ధన సంపద కన్నా వన సంపదను అందించడమే మనముందున్న అసలైన కర్తవ్యమనే సిఎం కెసిఆర్ స్పూర్తినికొనసాగించాల్సిన బాధ్యత మనందరిమీదా వున్నదని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ను ఎంపీ అభినందించారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్….వారు జపాన్ లో ప్రజాదరణ పొందిన మియావాకి పద్దతిలో అటవీ పునరుద్దరణ కార్యక్రమాన్ని జిహెచ్ ఎమ్సీ వారి సహకారంతో తెలంగాణలో శ్రీకారం చుట్టనున్నారు. గచ్చబౌళిలో మొక్కను నాటి ప్రారంభించనున్న ఈ వినూత్న కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రావాలని కోరుతూ… ఆ సంస్థ, కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) జనరల్ మేనేజర్ ఎస్ ఎస్ ప్రసాద్ గురువారం ప్రగతి భవన్ లో ఎంపీ సంతోష్ కుమార్ ను కలిసి ఆహ్వానించారు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల ఎంపీ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ… ‘‘పెట్రోల్ డీజిల్ వంటి సహజ వనరులు రోజు రోజు కూ ఖర్చయిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో భవిష్యత్తు తరాలకు ధన సంపదకన్నా వన సంపదను పంచివ్వడానికి మనం ప్రాధాన్యతనివ్వాలి. పచ్చదనాన్ని, ప్రక్రుతిని, సహజ వనరులను తిరిగి పునరుద్దరించే చర్యలను చేపట్టే బాధ్యత ప్రతి వొక్కరిమీదా వున్నది. ఆ దిశగా ముందడుగు వేసిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారిని అభినందిస్తున్న. వారే కాదు..సహజ వనరుల ఖర్చులో పరోక్షంగా భాగస్వామ్యం అవుతున్న.. అన్ని పెట్రోల్ డీజిల్ విక్రయ సంస్థలకు కార్పోరేషన్లకు ఈ దిశగా మరింత బాధ్యతవున్నది. భూగోళం మీద పచ్చదనాన్ని పెంచేందుకు వారి వంతుగా నడుం బగించాలి. తమ కార్పోరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీలో భాగంగా పచ్చదనాన్ని పెంచడంలో ఇండియన్ ఆయిల్ సంస్థ నుంచి స్పూర్తి పొందాల్సిన అవసరం ఇతర పెట్రోలియ్ ఉత్పత్తుల క్రయ విక్రయ సంస్థలకున్నది. సిఎం కెసిఆర్ గారి స్పూర్తితో ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యం కూడా… అందరికీ పచ్చదనం పట్ల స్పూర్తిని నింపడమే..ఆ దిశగా ఇండియన్ ఆయిల్ వంటి కార్పోరేట్ సంస్థలు కదలడం అంతరించి పోతున్న అడవులను పునరుద్దరించడం.. పచ్చదనం పెంపకంలో గుణాత్మక పరిణామం.’’ అరి అన్నారు. కాగా తాము ఇప్పటికే ఘట్ కేసర్ లో అంతరించి పోతున్న అడవిని దత్తత తీసుకుని పెంచుతున్నామని.. తాము రానున్న రోజుల్లో పచ్చదనం పెంచే కార్యక్రమానికి మా వంతు సహకారాన్ని అందిస్తామని.. ఎంపీ సంతోష్ కుమార్ స్పష్టం చేశారు.ఈ సందరర్భంగా సంస్థ సిఎస్సార్ జనరల్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ…ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ తన కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా..ఇప్పటికే, విద్య, సానిటేషన్ తదితర రంగాల్లో తన వంతు కర్తవ్య నిర్వహణ చేస్తున్నదని… అయితే..సిఎం కెసిఆర్ మానస పుత్రిక..హరిత హారం స్పూర్తిగా ఎంపీ సంతోష్ కమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తమకు మరింత స్పూర్తి నింపిందనీ తెలిపారు.
ఆ స్పూర్తితోనే తమ సంస్థ అడవి పునరుద్దరణ ( afforestation) చర్యలు చేపట్టి అందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని గచ్చిబౌలిలో.. జిహెజ్ ఎమ్సీ వారి సహకారంతో చేపట్టనున్నామని తెలిపారు.అంతరించి పోతున్న అడవుల పునరుద్దరణ కోసం జపాన్ లో మియావాకి అనే విప్లవాత్మక పద్దతిని ఆ దేశం అమలు పరుస్తున్నదని, ఈ విధానంలో మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపు మామూలు పద్దతిలో కంటే…30 శాతం అధికంగా వుంటుందని తెలిపారు. ఈ పద్దతిలో మొక్కలు నాటడం అనేది.. నాటి ఉమ్మడి రాష్ట్రంలో సహా నేటి తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాల్లో ఇదే మొట్టమొదటి సారి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభకులు, కార్యక్రమ మెంటర్.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను ఆహ్వానించడం తమకు గర్వకారణమని తెలిపారు. కాగా…ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టిన రోజైన ఫిబ్రవరి 17 న ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని…తేదీ, సమయం ఫైనల్ చేయగానే అందుకు సంబంధించి పూర్తి వివరాలతో మరో ప్రకటన చేయనున్నామని ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో …గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యనిర్వాహకులు రాఘవ తదితురలు పాల్గొన్నారు.
Tags CM KCR green challenge joginapalli santhosh kumar slider telangana telangana governament trs governament trsmp