టాలీవుడ్ దర్శకుడు మల్లికార్జున రావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రెండేళ్ల క్రితం ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన మల్లికార్జున రావు రోడ్డు యాక్సిడెంట్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేకపోయినా తీవ్ర గాయాలు కావడంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
