Home / ANDHRAPRADESH / లేడీ కానిస్టేబుల్ డ్రెస్ మార్చుకుంటుంటే చిత్రీకరణ.. ఛీఛీ…ఎల్లోమీడియానా..బ్లూ మీడియానా..!

లేడీ కానిస్టేబుల్ డ్రెస్ మార్చుకుంటుంటే చిత్రీకరణ.. ఛీఛీ…ఎల్లోమీడియానా..బ్లూ మీడియానా..!

అమరావతి ఆందోళనల నేపథ‌్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు బందోబస్త్‌ నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా తుళ్లూరు, మందడం వంటి గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసుల పట్ల ఆందోళనకారులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వారికి కనీసం తాగడానికి కూడా వాటర్ బాటిల్స్ కూడా అమ్మకుండా మా ఊరి నుంచి వెళ్లిపోండి అంటూ ఈసడించుకుంటున్నారు. కనీసం వాళ్లను నీడపట్టున కూర్చోనివ్వకుండా తారు, కారం చల్లుతూ…ఇబ్బందులు పెడుతున్నారు. ఆందోళనకారుల్లో కొందరు మదమెక్కిన మృగాళ్లు…రోజంతా ఇక్కడే డ్యూటీలు చేస్తున్నారు..ఇంటికేం కాపురం చేస్తారు..మా దగ్గర పడుకోండి అంటూ అసభ్యంగా మాట్లాడుతూ మహిళా కానిస్టేబుళ్లను లైంగికంగా వేధిస్తున్నారు. దీనిపై మహిళా కానిస్టేబుళ్లు జాతీయ మహిళా కమీషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆఖరకు ఓ లేడీ కానిస్టేబుల్ డ్రెస్‌ మార్చుకుంటుంటే.. ఆందోళనకారులు ఎల్లోమీడియా ఛానళ్ల కెమెరామెన్‌లతో కిటికీల్లోంచి షూట్ చేయించడం..ఈ వేధింపుల పర్వానికి పరాకాష్ట అనే చెప్పాలి.

తాజాగా మందడం గ్రామంలో ఎల్లోమీడియా ఛానళ్లు ఆందోళనకారులతో కలిసి చేసిన ఛండాలపు పని బట్టబయలైంది. అమరావతి గ్రామాలలో బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను బెదిరించి అక్కడి నుంచి పంపించేందుకు కొందరు ఆందోళనకారులు.. పచ్చ మీడియా సాయంతో వికృత చేష్టలకు తెరతీశారు. దుస్తులు మార్చుకుంటున్న ఓ ట్రైనీ కానిస్టేబుల్‌ను కెమెరాలతో చిత్రీకరించారు. అసెంబ్లీ బందోబస్తు విధులు నిర్వర్తించేందుకు ఒంగోలు పీటీసీ నుంచి సుమారు 370 మంది వరకు ట్రైనీ మహిళా కానిస్టేబుళ్లు విధులకు వచ్చారు. వారికి మందడంలోని జెడ్పీ హైస్కూల్‌లోని ఖాళీ తరగతి గదుల్లో వసతి కల్పించారు. ఈ క్రమంలో వారిని బెదిరించి అక్కడి నుంచి పంపించేందుకు కొందరు ఆందోళనకారులు ప్రయత్నించారు. పచ్చ మీడియాను వెంటబెట్టుకుని వసతి గదుల వద్దకు చేరుకుని అక్కడ కిటికీల్లోంచి గదిలో దుస్తులు మార్చుకుంటున్న ఓ మహిళా ట్రైనీ కానిస్టేబుల్‌ను వీడియో తీశారు. కెమెరాలతో షూట్ చేస్తున్నారని గమనించిన ఆ మహిళా కానిస్టేబుల్‌.. వెంటనే భయంతో విద్యార్థులు కూర్చునే బెంచీల చాటున తలదాచుకున్నారు. లేడీ కానిస్టేబుల్ డ్రెస్ ఛేంజ్ చేసుకుంటుంటే..ఎల్లోమీడియా ఛానళ్ల కెమెరామెన్‌లు షూట్ చేస్తున్నారని గమనించిన వసతి ఇన్‌చార్జి అధికారి వారిని నిలదీశారు. దీంతో సదరు ఎల్లోమీడియా ఛానళ్ల ప్రతినిధులు తాము పాత్రికేయులమంటూ.. బాధితురాలికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే బాధిత మహిళా కానిస్టేబుల్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి.. తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్ బట్టలు మార్చుకుంటుంటే…చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందిన సదరు ఎల్లోమీడియా ఛానళ్ల ప్రతినిధులపై తుళ్లూరు పోలీసులు కేసులు నమోదుచేశారు.

కాగా ఈ ఘటనపై సీఐడీ అడిషనల్‌ ఎస్పీ సరిత, విశాఖ డీఎస్పీ ప్రేమ్‌కాజల్, తెనాలి డీఎస్పీ శ్రీలక్ష్మి తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమాజాన్ని చైతన్య పరచాల్సినవారు.. మహిళలతో అనుచితంగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మొత్తంగా రాజధాని గ్రామాల్లో చంద్రబాబు అనుకుల మీడియా ప్రతినిధులు చేసిన ఛండాలపు పని పట్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కోసం ఎల్లోమీడియా ఆఖరకు బ్లూమీడియాగా దిగజారిపోయింది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat