విక్టరీ వెంకటేష్..తాను నటించిన మొదటి సినిమా నుండి ఇప్పటివరకు ఒకే ఊపులో ఉన్నాడు. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలతో సైతం పోటీ పడుతూ తనకు సాటిలేరు అని నిరూపిస్తున్నాడు. ఇంక వెంకీ అంటే కామెడీకి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కు పెట్టింది పేరు. అంతేకాకుండా తులసి లాంటి మాస్ సినిమాలతో మంచి క్రేజ్ ఉంది. ఇక అసలు విషయానికి వస్తే వెంకీ తాజాగా ఒక రీమేక్ సినిమా తీస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ పై కన్నేశాడు. దీనికి సంబంధించి మంగళవారం అర్ధరాత్రి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రచ్చ చేస్తుంది. ఇక దీని షూటింగ్ రాయలసీమలోని అనంతపురంలో ఈరోజు పూజా చేసి ప్రారంభించడం జరిగింది.
