తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డంగా దొరికారు.
మున్సిపల్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో మంగళవారం రాత్రి ప్రచారం చేసేందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నించారు.
ఈ విషయం తెల్సిన స్థానిక టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ,నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడ్దుకున్నారు. ఈ విషయం తెల్సిన ఎన్నికల అధికారులు ఎంపీ కారును సోదా చేశారు.
అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నేతలు,కార్యకర్తలు డిమాండ్ చేశారు.