Home / ANDHRAPRADESH / హవ్వ…కృష్ణా, గుంటూరు జిల్లాల మగవాళ్లను అంత మాట అన్నావేంటీ..జేసీ…!

హవ్వ…కృష్ణా, గుంటూరు జిల్లాల మగవాళ్లను అంత మాట అన్నావేంటీ..జేసీ…!

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నోరు తెరిస్తే బూతులు అవలీలగా వచ్చేస్తుంటాయి. ఎప్పుడు ఎవర్ని బూతులు తిడతారో తెలియదు..‎ఇటీవల వైసీపీ నేతలు మగాళ్లయితే కొజ్జాలను అడ్డంపెట్టుకుని రాజకీయం చేయకండి అంటూ పోలీసులనుద్దేశించి నోరుపారేసుకున్నాడు. తాజాగా సేవ్ అమరావతి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సారథ‌్యంలో రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలంటూ రాజధాని గ్రామాల రైతులు నెలరోజులుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో మగవారి కంటే మహిళలే పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

 

సంక్రాంతి పండుగనాడు అమరావతికి వెళ్లి చంద్రబాబు ఫ్యామిలీతో సహా ఉపవాసం ఉంటున్న రైతులకు మద్దతు ప్రకటించిన జేసీ దివాకర్ రెడ్డి తొలుత సీఎం జగన్‌పై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. అమరావతిలో ఒక కమ్మవాళ్లే భూములు కొన్నారంటే నేను ఒప్పుకోనన్న జేసీ… అధికారంలోకి రాగానే సీఎం జగన్ రాజధానిని వైజాగ్‌‌కు మార్చాలని నిర్ణయించారని ఆరోపించారు. జగన్ ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి గత ఎనిమిది నెలలుగా ఢిల్లీకి, వైజాగ్‌కు తిరిగారని ఆరోపించారు. వైజాగ్‌లో ఎవరెవరు భూములు కొన్నారో తెలయదు కానీ..మా టీడీపీ నేతలు పెద్ద లిస్ట్ చూపిస్తున్నారని ఆరోపించారు.

 

ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాల మగవాళ్లపై నోరుపారేసుకున్నాడు. కృష్ణా, గుంటూరు జిల్లాల మ‌గ‌వాళ్ల కంటే త‌మ ఆడ‌వాళ్లు మేల‌ని జేసీ దివాకర్ రెడ్డి వ్యంగంగా వ్యాఖ్యానించారు. రాజధాని గ్రామాల్లో మగవారికంటే మహిళలే ఆందోళనల కార్యక్రమాల్లో చురుకుగ్గా పాల్గొని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని…మగవాళ్లు మాత్రం ఆడవాళ్ల పక్కన నిల్చుంటున్నారని జేసీ సెటైర్లు వేశారు. అయినా ఇలా టెంట్లు వేసుకుని హాయిగా కూర్చుంటే జగన్‌కు ఏం నష్టం వచ్చిందని చంద్రబాబుతో సహా అమరావతి ఆందోళనకారులను జేసీ వెటకారం ఆడారు. జేఏసీతో మాట్లాడి రాయలసీమ, ఆంధ్రా వాళ్లంతా రోడ్డు మీదకు వచ్చి తీరాల అని జేసీ తెలిపారు. మొత్తంగా కృష్ణా, గుంటూరు మ‌గ‌వాళ్ల కంటే మా సీమ ఆడ‌వాళ్లు మేల‌ని పోలుస్తూ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంతటా హాట్‌టాపిక్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat