ఏపీ అంతటా సంక్రాంతి సంబరాలు ఘనంగా ఆరంభమయ్యాయి. తొలి రోజు భోగి మంటలతో సంక్రాంతికి ఆహ్వానం పలుకుతున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో నేడు నిర్వహించనున్న సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 3.45 గంటల నుంచి 4.45 వరకు గుడివాడలోని లింగవరం రోడ్ కే కన్వెన్షన్లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొంటారు. తిరిగి 5.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. గుడివాడకు సీఎంజగన్ రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి సంబరాలకు సీఎం జగన్ రాకతో గుడివాడ ప్రజల ఆనందం మరింత రెట్టింపు అయింది.
