టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని రాజకీయంలో చక్రం తిప్పుతున్నారు. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా, సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొంటున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా పవన్ కల్యాణ్ విజయవాడలో భారీ కవాతుకు సిద్ధమవుతున్నారు. అలాగే అమరావతిపై కేంద్రంలోని పెద్దలతో కలిసి మాట్లాడుతున్నారు. ఇక సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ చంద్రబాబుతో కలిసి అమరావతి జేఏసీ సభలలో పాల్గొంటూ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అయితే మరో ఎర్ర పార్టీ సీపీఎం మాత్రం అమరావతి రాజకీయంలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు..ఆ పార్టీ అధినేత రాఘవులు తొలుత మూడు రాజధానులను వ్యతిరేకించినా..బాబు రాజకీయం చూసి సైలెంట్ అయిపోయారు.
అయితే గత ఎన్నికల్లో టీడీపీతో విబేధించి, జనసేనతో పొత్తుపెట్టుకున్న సీపీఐ నేతలు ఇప్పుడు చంద్రబాబుతో కలిసి రాజధాని రాజకీయంలో కలసి సాగడం వెనుక పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ మేరకు పవన్ కల్యాణ్, సీపీఐ నారాయణ, రామకృష్ణలు చంద్రబాబుకు పెయిడ్ ఆర్టిస్టులుగా మారారని, కేవలం బాబు విసిరే డబ్బుల కోసం అమరావతికి జై కొడుతూ వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు ప్యాకేజీలకు ఈ ముగ్గురు నేతలు అమ్ముడు పోయారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి అనుకూలంగా పోరాడేందుకుగాను చంద్రబాబు పవన్‌కు రూ. 250 కోట్లు, సీపీఐ నారాయణ, రామకృష్ణలకు చెరో 100 కోట్లు ప్యాకేజీగా ఇచ్చారని..అందుకే రాజధాని రైతుల తరపున ఈ ముగ్గురు నేతలు గళం విప్పుతున్నారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. మరి ఈ ప్యాకేజీల లోగుట్టు చంద్రబాబుకే తెలియాలి…కాగా అమరావతిలో బయటపడుతున్న ఈ పెయిడ్ ఆర్టిస్టుల బాగోతం ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి వుంది.