సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఈనెల 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అయితే ఆ ఈవెంట్ తరువాత నుండి టీమ్ మొత్తం ప్రమోషన్లు పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే బుధవారంనాడు ఆ టీమ్ ను యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసింది. దీనికి మహేష్, రష్మిక, అనిల్, విజయశాంతి, డీఎస్పీ వచ్చారు. ఇందులో భాగంగా సుమ, అనిల్ మధ్య సరదా సన్నివేశాలు జరిగాయి. అవేమిటంటే అనిల్ సుమను మీరు ఈ మధ్య షోలతో భాగా బిజీ అయిపోతున్నారు కదా రానున్నరోజుల్లో మీరు అందుబాటులో లేకుంటే నేను చేయడానికి మీ దగ్గర నేర్చుకోవాలి అనుకుంటున్నా అని అనగా సరే నేర్పిస్తా నేర్చుకోండి అని సుమ చెపుతుంది. అలా ప్రోగ్రామ్ మొత్తం ఎంతో సరదాగా జరుగుతుంది.