అల్లుఅర్జున్ హీరోగా, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే జనవరి 6న యూసుఫ్ గూడా గ్రౌండ్స్ వేదికగా అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే తాజాగా దీనికి సంబంధించి శ్రేయాస్ మీడియా అదినేత శ్రీనివాస్ తో పాటు యగ్నేష్ పై కూడా కేసు నమోదు చేసారు. కండిషన్స్ మించి ఈవెంట్ ఉండడంతో కేసు ఫైల్ చేసారు.అసలు జనవరి 2న వారు 5వేల మంది వస్తారు, 10గంటల వరకు ఈవెంట్ ఉంటుందని పర్మిషన్ తీసుకున్నారు. కాని అక్కడ మొత్తం చెప్పినదానికి వ్యతిరేకంగా జరిగింది. మరోపక్క ఈవెంట్ 11.30 వరకు జరిగింది. ఆరోజు సాయంత్రం నుండే ప్రజలు ఎంతగా ఇబ్బందిపడ్డారో అందరు చూసారు. ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యారు.
