అమరావతి ఆందోళనకారులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.శాంతియుతంగా ఆందోళన చేసుకుంటామనే పేరుతో హింసాయుత ఘటనలకు పాల్పడ్డారు. పిన్నెల్లిపై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు తేలింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తిస్తున్నామని నిరసన పేరుతో దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ చెప్పడం జరిగింది.గుంటూరు జిల్లా, చినకాకాని వద్ద సర్వీస్ రోడ్డులో వెళుతున్న ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును అడ్డుకున్న కొందరు ఆందోళనకారులు రాళ్లు, కర్రలతో దాడి చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు అడ్డుకోబోయిన పిన్నెల్లి గన్మెన్లపై కూడా భౌతికదాడికి పాల్పడ్డారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా..పిన్నెల్లి మాత్రం సంయమనం పాటించి…గన్ ఫైరింగ్ ఓపెన్ చేయకుండా జాగ్రత్తపడ్డారు.