తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల జనవరిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్,బీజేపీలు సర్వత్ర సిద్ధమవుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు.
మున్సిపాలిటీల వారీగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో ఇరవై రెండు జిల్లాల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు.
ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న నూట ఇరవై మున్సిపాలిటీలు,పది మున్సిపల్ కార్పోరేషన్లలో 53,36,605 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 26,71,694మంది ఉన్నారు. మహిళలు 26,64,557మంది ఉండగా 354మంది ఇతరులు ఉన్నారు. అయితే రేపు మంగళవారం పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది.