తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రేవంత్ రెడ్డి పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.రేవంత్ కాంగ్రెస్‌లోకి వెళితే ఆ పార్టీకి శనిపట్టినట్లేనంటూ అయన ఆరోపించారు. రేవంత్ ఒక ఐరన్ లెగ్ అని వ్యాఖ్యానించారు. అందుకే తెలంగాణలో టీడీపీ నాశనమైందన్నారు. మాలాంటి నేతలు 30 ఏళ్ళపాటు పార్టీని బలోపేతం చేస్తే… రేవంత్ వచ్చిన కేవలం ఆరేళ్లలోనే పార్టీని భ్రష్టుపట్టించారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మరీ ముఖ్యంగా రేవంత్ తన భాషను మార్చుకోవాలంటూ మాధవరం హితవు పలికారు.
Post Views: 410