వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ మరియు నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు.”ఎలక్షన్ల ముందు కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. జగన్ గారు సిఎం అయితే భూములు లాక్కుంటారని, ఇళ్లలోంచి వెళ్లగొడతారని, రౌడీరాజ్యం వస్తుందని భయానక దృశ్యాలు చూపించారు. ప్రజలు మిమ్మల్నే అధికారం నుంచి విసిరి కొట్టి బుద్ధి చెప్పారు. అయినా అవే గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారు” అని అన్నారు. ఇంక మరో ట్వీట్ లో “తీసేసిన తాసిల్దార్లంతా పళ్లు పటపట కొరుకుతున్నారు.విషం కక్కడంలో పోటీలు పడుతున్నారు. జగన్ గారి నివాసం మీ హయాంలోనే పూర్తయింది.అనుమతి లేకపోతే అప్పుడు నోళ్లెందుకు పెగల్లేదు. లింగమనేని గెస్ట్ హౌజులా నదిని పూడ్చి కట్టింది కాదు కదా.తోక కనిపించకున్నా అదిగో పులి అనే బ్యాచ్ తయారైంది” అని అన్నారు.