ప్రస్తుతం పేదవారికి ఉన్న ఏకైక సమస్య అనారోగ్యం పేదరికం అనారోగ్యం వల్ల ఎంతో మంది అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో గతంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన పాదయాత్రలో పేదల కష్టాలు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే పేదవారికి ఉచితంగా వైద్యం అందించేవారు. వైయస్ మరణానంతరం ఆరోగ్యశ్రీని పట్టించుకున్న పాపాన పోలేదు.ఆరోగ్యశ్రీ కార్డు చూపించి వైద్యం చేయించుకోవాలి అనుకున్న ప్రతి పేదవాడికి నిరాశ ఎదురైంది పైగా రాజశేఖర్ రెడ్డి పెట్టిన వ్యాధులన్నిటినీ ఆరోగ్యశ్రీ పథకం నుండి తొలగించారు. అనంతరం దాదాపుగా పది సంవత్సరాలు తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ తనయుడు జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీకి తిరిగి ప్రాణం పోసారు.
ఇప్పటికే ఉన్న వ్యాధులతో పాటు మరికొన్ని వందల వ్యాధుల్ని కలిపి ఆరోగ్యశ్రీని నడిపించడమే కాకుండా వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వ్యాధిని ఆరోగ్యశ్రీ లోకి తీసుకుని భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన నిర్ణయం జగన్ పాటిస్తున్నారు. మరోవైపు క్యాన్సర్ కు సంబంధించి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్తో చాలా మంది ప్రజలు ఇప్పటికే తమ ప్రాణాలు విడిచారు. ఆర్థిక స్థోమత లేక ప్రాణాలు దక్కించుకోలేక వైద్యం చేయించుకోలేక మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి క్యాన్సర్ అయినా ఏ రకమైన క్యాన్సర్ అయినా ఎలాంటి జబ్బు అయినా సరే ఉచితంగా ట్రీట్మెంట్ చేయిస్తామని పేద వాళ్ళు ఎవరు ఆందోళన చెందవద్దని పశ్చిమగోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీ ప్రారంభించిన అనంతరం జగన్ మాట్లాడుతూ ఈ హామీ ఇచ్చారు. ప్రస్తుతం యువ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల కాన్సర్ రోగులతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.