తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు దేశ వ్యాప్తంగా బృహత్తర కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలు పెట్టిన తరుణంలో ఇప్పటికే నాలుగు కోట్ల వరకు మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. మొక్కలు లేనిదే మానవజాతి మనుగడ లేదని కాబట్టి మొక్కలు నాటడమే కాకుండా పెంచడం కూడ ఒక సామాజిక బాధ్యత గా తీసుకోవాలి పిలుపునిచ్చారు .
హరిత తెలంగాణ కొసం అందరం భాగస్వాములం కావాలని అన్నారు. ఇందులో భాగంగా ఎం.పి జోగినపల్లి సంతోష్ కుమార్ గారు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ అప్జల్ గంజ్ లోని తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంధాలయం ఆవరణంలో మూడు మొక్కలు నాటుతూ నా తరపున మరో ముగ్గురికి 1. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ వైస్ ఛాన్సలర్ సురేష్ 2.ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి 3. రాష్ట్రంలోని 33 జిల్లాల గ్రంధాలయ అధ్యక్షులకు ఈ గ్రీన్ ఛాలెంజ్ ఇస్తున్నానని వారు మొక్కలు నాటాలని వారు కూడా మరో ముగ్గురు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరుతున్నాను అని అన్నారు…
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ , గ్రంథాలయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహులు, రిజిస్టర్ ఆఫ్ DD వెంకటేశ్వరరావు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు…