Home / ANDHRAPRADESH / బ్రేకింగ్…ఆంధ్రజ్యోతిపై టీటీడీ 100 కోట్ల పరువునష్టం దావా…!

బ్రేకింగ్…ఆంధ్రజ్యోతిపై టీటీడీ 100 కోట్ల పరువునష్టం దావా…!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్ర తిరుమల తిరుపతి ఆలయ ప్రతిష్టను కించపర్చడం ద్వారా కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లోమీడియా రంగంలోకి దిగింది. తొలుత ఆర్టీసీ బస్ టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ నేతలు, ఎల్లోమీడియాతో పాటు లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా నానా యాగీ చేసింది. అయితే అధికారుల విచారణలో ఆ గత టీడీపీ హయాంలోనే కొందరు అనుకుల అధికారులే చేయించారని తేలడంతో నోరుమూసుకున్నారు. ఆ తర్వాత శేషాచల కొండల్లో చర్చి అంటూ టీడీపీ పెయిడ్ కార్యకర్తలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. అది చర్చి కాదని అటవీ శాఖ అధికారులు సోలార్ కరెంట్ కోసం ఏర్పాటు చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో తిరుమలలో చర్చి అంటూ దుష్ప్రచారం చేసిన సదరు టీడీపీ పెయిడ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా ఎల్లోమీడియా టీటీడీపై విషం కక్కడం ఆపడం లేదు. ఇటీవల టీటీడీ వెబ్‌సైట్‌, క్యాలెండర్‌‌లో యేసు పదం ఉందని, బాబుగారి అనుకుల ప్రతిక ఆంధ్రజ్యోతి వరుసగా తప్పుడు కథనాలు ప్రచురించి వెంకన్న భక్తుల మనోభావాలను గాయపర్చింది.

 

ఆంధ్రజ్యోతి పత్రిక అసత్య కథనాలపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. నిజానికి టీటీడీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్స్ అన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయి. కొత్తగా చిన్న చిన్న అప్‌డేట్స్ తప్పా..పెద్దగా మార్పులేమి జరుగలేదు..కాని ఆంధ్రజ్యోతి మాత్రం వెబ్‌సైట్‌లో ఏసు పదం ఉందంటూ మార్ఫింగ్ ఫోటోలతో అసత్యకథనం ప్రచురించింది. అలాగే క్యాలెండర్‌లో కూడా ఏసు ప్రస్తావన ఉందంటూ పచ్చ కథనాలు పచ్చిగా వండి వార్చింది. సీఎం జగన్‌ను హిందూవులను దూరం చేయడానికే ఎల్లోమీడియా ఇలా బరితెగించి తిరుమల వెంకన్నపై బురద జల్లుతుందని అర్థమవుతుంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంపై ఎల్లోమీడియా చేస్తున్న అసత్య ప్రచారంపై టీటీడీ పాలకమండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ తిరుమలలో సమావేశమైన టీటీడీ పాలకమండలి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ట దెబ్బతినే విధంగా తప్పుడు కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయాలని నిర్ణయించింది. అలాగే రమణ దీక్షితులును ఆలయ ప్రధాన అర్చకుడిగా నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం జరిగిన పాలక మండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. మొత్తంగా కేవలం తమ కులప్రభువు చంద్రబాబు మెప్పుకోసం, సీఎం జగన్‌పై క్రిస్టియన్ ముద్ర వేసేందుకు తిరుమల వెంకన్నను బద్నాం చేసిన ఆంధ్రజ్యోతి పత్రికపై టీటీడీపీ 100 కోట్ల పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించడం రాజకీయంగా సంచలనంగా మారింది. మరి ఈ దావాపై సదరు పచ్చ పత్రిక యజమాని ఎలా స్పందిస్తాడో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat