వార్నీ..ఏందిదీ…నేనెక్కడా చూడ్లే….ఆరు నెలల్లో ఎంత మార్పు.. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇదే రాజధాని ప్రాంతానికి ప్రధాని మోదీ వస్తే.. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తాయి. మోదీని అమరావతిలో అడుగుపెట్టనిచ్చేదే లేదంటూ చంద్రబాబు గారు హూంకరించారు. ఆర్నెళ్లలో సీన్ మారిపోయింది. ఇప్పుడు అదే రాజధాని ప్రాంతంలో గత పదిరోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో ఎక్కడ చూసినా మోదీ, అమిత్‌షా మాస్క్‌లే కనిపిస్తున్నాయి. మోదీ గారు మాకు న్యాయం చేయాలని దండాలు పెడుతున్నారు. ఇంతలో ఇంత మార్పా..అంతా శ్రీ మాన్ చంద్రబాబు గారి మార్క్ రాజకీయం..బాబు ఏ టర్న్ తీసుకుంటే..ఆయన సామాజికవర్గం ఆ టర్న్ తీసుకుంటుంది. గత ఎన్నికలకు ముందు బాబుగారు ప్రధాని మోదీని ఎలా తిట్టారో మీరు చూడండి.. మోసాల మోదీ…నువ్వు ఎంత అణగదొక్కితే నేను అంత రెచ్చిపోతా…మోదీ దేశాన్ని భ్రష్టు పట్టించాడు..మోదీ జిత్తులు,కోడి కత్తులకు భయపడను..బీజేపీకి సహకరించేవాళ్ళు దేశద్రోహులు..ఈదేశంలో అవినీతిని పెంచి పోషించింది నరేంద్రమోడీయే….నాకొక భార్య కొడుకు, మనవడు ఉన్నాడు…నువ్వు పెళ్లాన్ని వదిలేసావు…నీకు పిల్లలు లేరు…కుటుంబమే లేదు…నువ్వు నన్ను విమర్శిస్తున్నావా….ఇదిగో మోడీ…గో బ్యాక్ అంటే మళ్ళీ నిన్ను ప్రధాని కుర్చీలో కూర్చోమంటున్నామనుకున్నావేమో….గో బ్యాక్ అంటే…నువ్వు గుజరాత్ కి పోయి..నీ సొంత ఊర్లో ఉండిపొమ్మంటున్నాం…నీకు ప్రధానిగా ఉండే అర్హత లేదని గుర్తుంచుకో…అసలు నువ్వు మళ్లీ ప్రధాని ఎలా అవుతావో చూస్తా..నాతో పెట్టుకోకు ఖబద్ధార్ అంటూ ప్రధాని మోదీపై ఇదే చంద్రబాబు రంకెలు వేశాడు. అయితే సీన్ రివర్సైంది. కేంద్రంలో మోదీ తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తే..చంద్రబాబు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయం పాలయ్యాడు.
ఇంకేముంది మళ్లీ బాబుగారు యూటర్న్ తీసుకున్నాడు..తెలివిగా తన నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించి..వారి ద్వారా మళ్లీ మోదీ భిక్ష కోసం పాకులాడుతున్నాడు..అయితే బాబుగారి నక్కజిత్తులు తెలిసిన మోదీ, అమిత్‌షాలు ఏపీలో పరిస్థితులను గమనిస్తూ వూహాత్మక మౌనం పాటిస్తున్నారు. దీంతో దిక్కుతోచని బాబుకు మూడు రాజధానుల వ్యవహారం కలిసివచ్చింది. ఇదే మంచి అవకాశమని మోదీకి బిస్కెట్ వేసేందుకు రెడీ అయిపోయాడు. ఇంకేముందు..అమరావతిలో క్షణాల్లో మోదీ, అమిత్‌షా మాస్క్‌లు దిగిపోయాయి. వాటిని అనుకుల రైతులకు, మహిళలు, యువత ముఖాలకు తగిలించి..మోదీ భజన చేయిస్తున్నాడు.ఎల్లోమీడియాలో కూడా తనతో పాటు మోదీ, అమిత్‌షాలను కూడా హైలెట్ చేయిస్తున్నాడు.. తుళ్లూరు, వెలగపూడి, మందడం వంటి గ్రామాల్లో రైతులు, మహిళలు, యువకులు, ఆఖరుకు చిన్నపిల్లలకు కూడా మోదీ మాస్క్‌లు తగిలించి నిరసన డ్రామాలు ఆడిస్తున్నారు. కొందరైతే మోదీ మాస్క్‌లతో రోడ్డుపై జిమ్ చేయడం, క్యారమ్స్ వంటి ఆటలాడడం ఈ నిరసన కార్యక్రమాల్లో వెరైటీ..అయితే అమరావతి ఆందోళనల్లో మోదీ, అమిత్‌షా మాస్క్‌లపై ఏపీ బీజేపీ నాయకులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్నెల్ల క్రితం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా టీడీపీ నాయకులు, పెద్దలు నల్ల జెండాలు పట్టుకుని తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ సానుభూతిపరులు చంద్రబాబు మాస్కుల్లేకుండా మోదీ మాస్కులు ధరించడం చూస్తుంటే కచ్చితంగా దురుద్దేశంతో కూడుకున్నదేనని ఇది టీడీపీ పెద్దల పక్కా ప్రణాళికలో భాగమేనని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష పెట్టించి..జాతీయ స్థాయి నాయకులను పిలిపించి దివ్యవాణి వంటి సెకండ్ గ్రేడ్ ఆర్టిస్టులతో ప్రధాని మోదీని బండబూతులు తిట్టించిన సంగతిని ఇంకా మరిచిపోలేదని బీజేపీ నేతలు అంటున్నారు. అలాగే బాబు బామ్మర్ది బాలయ్య మోదీని వచ్చీరాని హిందీలో ఒక నపుంసుకుడు అని తిట్టిన సంగతి కూడా మర్చిపోలేదని, బీజేపీ నేతలు అంటున్నారు. ఢిల్లీ దీక్షలో మోడీ Gave ముంత మట్టి, చెంబు నీళ్లు అన్న చంద్ర బాబు..ఇప్పుడు మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చుతారా అంటూ పెడబొబ్బలు పెట్టడం చూసి ఏపీ ప్రజలు నోరెళ్లపెడుతున్నారు. మొత్తానికి అమరావతి ఆందోళనల్లో మోదీ మాస్క్‌లతో చంద్రబాబు చేయిస్తున్న జిమ్మిక్కులు చూస్తుంటే..ఆహా బాబు బిస్కెట్ వేయడంలో నీ తర్వాతే ఎవరైనా అంటూ..నెట్‌జన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు.