తెలంగాణరాష్ట్రంలో ఎన్నికలు వస్తే చాలు కులమతాలను రెచ్చగొట్టడం ఆనవాయితీగా మారింది. కొందరు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనుకుంటున్నారు అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆయన ఈరోజు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని ఎలా రక్షించాలని ఆలోచించడం లేదు.
దేశంలో లౌకికత్వాన్ని పాటించే పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్‌లో ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో ఎవరికి తెలియకపోతుండే. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అన్ని మతాల, కులాల పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడం బీజేపీ చూడలేకపోతుంది.
హుజుర్నగర్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కించుకోవాలి. సమ్మక్క – సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? సమ్మక్క – సారక్క జాతరను టీఆర్ఎస్ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది. ప్రపంచం అంతా తెలంగాణ వైపు చూస్తుంటే.. తెలంగాణ సమాజం కేసీఆర్ వైపు, యువత అంతా కేటీఆర్ వైపు చూస్తుందన్నారు.