కొత్త ఏడాది 2020 లో బ్యాంకుల సెలవుల లిస్టును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధుల్లోని బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులుంటాయో తెలిపింది. 2020 వ సంవత్సరంలో బ్యాంకులకు మొత్తం ఇరవై సెలవులున్నాయి. వీటితో పాటు ఆదివారాలు, ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులే. కాగా ఈ సెలవులన్నీ హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ పరిధిలోని బ్యాంకులకు వర్తిస్తాయి. సో…రెగ్యులర్గా బ్యాంకులకు వెళ్ళేవారు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని తమ బ్యాంకింగ్ పనులను ప్లాన్ చేసుకోగలరు.
2020 వ సంవత్సరంలో బ్యాంకుల సెలవులు ఇవే..!
జనవరి 15 – సంక్రాంతి,
ఫిబ్రవరి 21 – మహాశివరాత్రి
మార్చి 9 – హోలీ
మార్చి 25 – ఉగాది
ఏప్రిల్ 1 – యాన్యువల్ క్లోజింగ్
ఏప్రిల్ 2 – శ్రీరామనవమి
ఏప్రిల్ 10 – గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14 – అంబేద్కర్ జయంతి
మే 1 – మే డే
మే 25 – రంజాన్
ఆగస్ట్ 1 – బక్రీద్
ఆగస్ట్ 11 – శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆగస్ట్ 15 – స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్ట్ 22 – వినాయక చవితి
అక్టోబర్ 2 – గాంధీ జయంతి
అక్టోబర్ 24 – దసరా
అక్టోబర్ 30 – మిలాద్ ఉన్ నబీ
నవంబర్ 14 – దీపావళి
నవంబర్ 30 – గురునానక్ జయంతి
డిసెంబర్ 25 – క్రిస్మస్