ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు.వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం..
మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు నేతృత్వంలో విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు ఒక ప్రముఖ హోటల్లో సమావేశమయ్యారు..ఈ భేటీలో విశాఖను పరిపాలన రాజధానిగా చేయనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానం చేశారు..
ఈ భేటీ అనంతరం గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ” విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిది.దీని వలన విశాఖ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు..