సూర్యుడు,భూమి మధ్య మార్గాన్ని చంద్రుడు అడ్డుకున్న సమయంలో ఏర్పడే గ్రహణాన్ని సూర్యగ్రహణం అని అంటారు. భూమి నుండి చూసినప్పుడు సూర్యునికి చంద్రుడు అడ్డంగా రావడంతో సూర్యునిలో కొంతభాగం మాత్రమే మనకు కన్పిస్తుంది.
ఆయా సందర్భాన్ని బట్టి పాక్షికంగా లేదంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
అయితే సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమ్మీద చాలా అరుదుగా ఏర్పడతాయి. అటు సూర్యగ్రహణం అమవాస్య రోజు మాత్రమే వస్తుంది.